- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.. ‘మకుటం’’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన దుషారా విజయన్
కోలీవుడ్ యంగ్ బ్యూటీ దుషారా విజయన్(Dushara Vijayan) వెట్టైయాన్, రాయన్ వంటి చిత్రాల్లో నటించి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ దుషారా విజయన్(Dushara Vijayan) వెట్టైయాన్, రాయన్ వంటి చిత్రాల్లో నటించి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం దుషారా, విశాల్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మగుడం’. తెలుగులో ఈ సినిమా ‘మకుటం’ (makutam)పేరుతో రాబోతుంది. ఆయన కెరీర్‌లో 35వ చిత్రంగా రాబోతుండగా.. రవి అరసు (Ravi Arasu)దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. వారి బ్యానర్‌లో రాబోతున్న 99వ చిత్రంగా రాబోతుండటం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ అంచనాలను రెట్టింపు చేశాయి.
దీంతో సినీ ప్రియులంతా ఈ చిత్రం థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, దుషారా విజయన్ ట్విట్టర్ ద్వారా క్రేజీ అప్డేట్ ఇచ్చింది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘మకుటంకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ప్రతి క్షణం చాలా మధురంగా అనిపించింది. గర్వంగా భావిస్తున్నాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను.
ఇవన్నీ సాధ్యం చేసిన అద్భుతమైన చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకంటే మంచి అనుభవాన్ని అడగడం సాధ్యం కాలేదు. మరికొంత పైకి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. అలాగే మూవీ టీమ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె షూటింగ్ పూర్తి అయిందంటే సినిమా కూడా త్వరలోనే థియేటర్స్‌లోకి వస్తుందని ఫుల్ ఖుషీ అవుతున్నారు.






