- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుల్కర్ సల్మాన్ ‘కాంత’ మూవీ రివ్యూ.. బాక్సాఫీసు వద్ద హిట్టా.. ఫట్టా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)జంటగా నటించిన తాజా చిత్రం ‘కాంత’(kantha).

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)జంటగా నటించిన తాజా చిత్రం ‘కాంత’(kantha). నవంబర్ 14న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు. విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఎంచుకున్న కథా నేపథ్యం కొత్తగా అనిపించినా, దాని నడిపించిన విధానం ప్రేక్షకులను ఆలోచనలోకి నెట్టేసింది. ఇద్దరు కళారంగానికి చెందిన వ్యక్తుల మధ్య వచ్చే సృజనాత్మక విభేదాలు, అహం, ఆర్టిస్టిక్ కాంక్లిక్ట్‌లను కథలో కీలకాంశాలుగా తీసుకున్నారు. ఈ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, చెప్పిన తీరు కొంతవరకు సాగదీసినట్లుగా ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. 1950ల సినీ ప్రపంచాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో టెక్నికల్ టీమ్ మంచి పనితనం చూపించింది.
ఆ కాలం నాటి సినిమా సెట్లు, వాతావరణం, యాక్టర్ల పర్ఫార్మెన్స్ మూవీ మొదటి భాగానికే మంచి హై ఇచ్చాయి. అయితే కథలోని పాతబడి కనిపించే ట్రాక్‌లు కారణంగా మొత్తం కథనం ఒక రోటీన్ స్టోరీలా అనిపించిందని కొందరు అంటున్నారు. సినిమాలో ఒక వైపు గురుశిష్యుల బంధం, మరో వైపు హీరో–హీరోయిన్ మధ్య ప్రేమ కథ… ఈ రెండు ట్రాక్‌లతోటి ‘కాంత’ను నడిపించారు. దుల్కర్ నటించిన నట చక్రవర్తి మహదేవన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. భాగ్యశ్రీ అందం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నప్పటికీ, పాత్రకు వచ్చిన స్కోప్ చాలా తక్కువ.మొత్తం మీద ‘కాంత’ విజువల్స్, యాక్టింగ్ పరంగా మెప్పించినా… స్టోరీ ట్రీట్‌మెంట్, నేరేషన్ వల్ల సినిమా మిక్స్‌డ్ టాక్‌తో సాగుతోంది.






