దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమా విడుదల వాయిదా.. కీలక ప్రకటనతో షాకిచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), భాగ్య శ్రీ బోర్సే(Bhagya Shri Borse) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంత’(kantha).

దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమా విడుదల వాయిదా.. కీలక ప్రకటనతో షాకిచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), భాగ్య శ్రీ బోర్సే(Bhagya Shri Borse) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంత’(kantha). సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. దీనిని స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా, మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ కీలక నోట్ రిలీజ్ చేశారు. ‘‘మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంత టీజర్ విడుదలైన రోజు నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయం, మద్దతు మమ్మల్ని ఎంతో హత్తుకుంది.

అది మాకు చాలా విలువైనది. మా చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతి ఇవ్వాలనుకుంటున్నాం. ‘కొత్త లోక’ ఘన విజయంతో, చంద్ర బాక్సాఫీసులో దూసుకెళ్తూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. అదే ఉత్సాహంతో, మిమ్మల్ని మరో అద్భుతమైన సినీ ప్రయాణంలోకి తీసుకెళ్లే ప్రత్యేక అనుభూతిని మేము సిద్ధం చేస్తున్నాం. ఆ దృష్ట్యా మా చిత్రం ‘కాంత’ విడుదల వాయిదా పడిందని మీకు తెలియజేస్తున్నాం. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. అంతవరకు మాకు ఇలానే అండగా నిలుస్తారని ఆశిస్తున్నాము. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దుల్కర్ అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

link

Next Story