టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన దుల్కర్ సల్మాన్.. మాస్ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్‌‌!

by Mallepaka Hamsa |

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సీతారామం, మహానటి వంటి క్లాసిక్ చిత్రాలతో తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.

టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన దుల్కర్ సల్మాన్.. మాస్ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్‌‌!
X

దిశ, సినిమా: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సీతారామం, మహానటి వంటి క్లాసిక్ చిత్రాలతో తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, దుల్కర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందించాయి. నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం దుల్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒకతార’. సాత్మిక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తుండగా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించడం విశేషం. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం.

2026లో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా దుల్కర్ మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్. మాస్ సినిమాలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi)ఈ కథను సిద్ధం చేశారని, దానిని విన్న దుల్కర్ బాగా ఇంప్రెస్ అయి వెంటనే ఒకే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న దుల్కర్.. తొలిసారిగా సంపత్ నంది లాంటి మాస్ డైరెక్టర్‌తో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది.

Next Story