దుల్కర్ సల్మాన్ ‘DQ-41’లో టాలీవుడ్ స్టార్ నటి.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) 41వ చిత్రంతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దుల్కర్ సల్మాన్ ‘DQ-41’లో టాలీవుడ్ స్టార్ నటి.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) 41వ చిత్రంతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా రాబోతుండగా..SLVసినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సరసన టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీంతో సినీ ప్రియులంతా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని దుల్కర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్‌మెంట్స్ చేస్తూ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా, ‘DQ-41’లో ఓ స్టార్ నటి నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రమ్యకృష్ణ పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ చిత్రబృందం.. ఆమె దుల్కర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని ప్రకటించడానికి థ్రిల్‌గా ఫిల్ అవుతున్న వెల్లడించారు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రమ్యకృష్ణ ‘ది ప్యారడైజ్’ దుల్కర్ సినిమాలతో మంచి లైనప్ సెట్ చేసిందని అంటున్నారు.

link

Next Story