‘Guns & Gulaabs’.. Dulquer Salmaan వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

by Dishanational2 |
‘Guns & Gulaabs’.. Dulquer Salmaan వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..
X

దిశ, సినిమా: ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ సిల్వర్ స్క్రీన్‌‌పై చేసే అవకాశాలు రాక చాలా మంది నటీనటులు వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ టాలెంట్ ప్రదర్శిస్తూ ప్రేక్షకులలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అయితే ప్రజెంట్ స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలో దుల్కర్ స‌ల్మాన్ కూడా చేరాడు. ‘గ‌న్స్ అండ్ గులాబ్స్’ పేరుతో ఫ‌స్ట్ టైమ్ అతను ఓ వెబ్‌సిరీస్‌తో రాబోతున్నాడు. రాజ్ డీకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సిరిస్ గులాబ్ గంజ్ అనే ఏరియాలో గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన పోరాటం చుట్టూ సాగ‌నున్నట్లు స‌మాచారం. కాగా సల్మాన్‌తో పాటు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్, ఆద‌ర్శ్ గౌర‌వ్, గుల్షన్ దేవ‌య్య కీల‌క పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్ట్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read: హీరో Surya బర్త్ డే స్పెషల్ ‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ



Next Story

Most Viewed