హీరో Surya బర్త్ డే స్పెషల్ ‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ

by Disha Web Desk 6 |
హీరో Surya బర్త్ డే స్పెషల్ ‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో సూర్య, శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

నేడు హీరో సూర్య పుట్టిన రోజు (జూలై 23) కావడంతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ చిత్ర యూనిట్ ‘కంగువ’ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో భారీ ఫైట్స్, ఉండటంతో పాటు యుద్ధ వీరుడిగా ఆకట్టుకుంటున్నాడు. విజువల్స్ ప్రధానంగా ఉండనున్నాయని తెలుస్తోంది. యుద్ధ సన్నివేశాలు చూపిస్తూ గ్లింప్స్ చివరిలో సూర్య.. ‘కుశలమా’ అంటూ వైల్డ్ గా అడుగుతూ భయపెడుతున్నాడు. సినిమాలో సూర్య మొత్తం ఐదు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్నట్లు సమాచారం.

Also Read: ‘గ‌న్స్ అండ్ గులాబ్స్’.. దుల్కర్ స‌ల్మాన్ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..


Next Story