- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాక రాక సినిమా ఆఫర్..పూజా రెమ్యూనరేషన్ తెలిస్తే బిత్తరపోవాల్సిందే ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు ( Pooja Hegde) ఉన్న క్రేజ్ అంతా కాదు. అప్పట్లో ఈ

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు ( Pooja Hegde) ఉన్న క్రేజ్ అంతా కాదు. అప్పట్లో ఈ పొడుగు కాళ్ళ సుందరి స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆచార్య సినిమా తర్వాత పూజా హెగ్డేకు ఛాన్సులు రాలేదు. గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చినా మధ్యలో తీసేశారని ప్రచారం ఇప్పటికీ జరుగుతోంది. దీంతో అప్పటినుంచి తెలుగులో ఒక్క సినిమా అవకాశం దక్కించుకోలేదు పూజా హెగ్డే. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది ఈ బ్యూటీ.
ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది పూజా హెగ్డే. వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం దక్కడమే గమనార్హం. అలాంటిది వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న పూజా హెగ్డే ఇందులో సెలెక్ట్ కావడం వింతే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ మూవీ ఎస్ ఎల్వీ సినిమాస్ పతాకం ( SLV Cinemas) పైన సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరా వేగంగా కొనసాగుతోంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రాక రాక అవకాశం వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఏకంగా ఈ సినిమా కోసం మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అంతకుముందు మూడు కోట్ల కంటే తక్కువగానే తీసుకున్న పూజా, ఇప్పుడు 3 కోట్లు వసూలు చేయడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కూలీ సినిమాలో ఐటెం సాంగ్ దెబ్బకు ఆమె బ్రాండ్ పెరిగిందని కొంతమంది అంటున్నారు.






