- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నప్పుడే అనుష్కతో కలిసి సినిమా చేసినట్లు డ్రీమ్ వచ్చింది: నవీన్ పొలిశెట్టి
‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.

దిశ, వెబ్‌డెస్క్: ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా సెప్టెంబరు 7వ తారీకున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అనుష్క హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ చిత్ర బృందం విశాఖ హోటల్ గ్రీన్ పార్క్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. హీరో నవీన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌కు, ప్రొమోలకు మంచి స్పందన లభించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నాకు హీరో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉండేది. అలాగే నాకు చిన్నప్పుడే అనుష్కతో కలిసి మూవీ చేస్తానని కల వచ్చింది. ఆ డ్రీమ్ ఇప్పుడు నిజమైంది.’’ అంటూ నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు.
Read More: ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేశా.. ఫస్ట్ లవ్‌పై జాన్వీ ఓపెన్






