బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా.. ‘అఖండ-3’ టైటిల్ లీక్ చేసిన తమన్

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘అఖండ-2’(Akhanda-2) పేరు మార్మోగిపోతోంది.

బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా.. ‘అఖండ-3’ టైటిల్ లీక్ చేసిన తమన్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘అఖండ-2’(Akhanda-2) పేరు మార్మోగిపోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటిస్తుండగా.. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రాబోతుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనుండగ.. హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో హైప్ పీక్స్‌లో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అఖండ-2’ డిసెంబర్ 5న థియేటర్స్‌లో సందడి చేయనుంది. అఖండ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెంచే ఓ క్రేజీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా ‘అఖండ-3’ సంబంధించిన టైటిల్ కావడం విశేషం. గతంలో ఇండియన్ సినిమాలను ఒక ఊపు ఊపిన ‘పుష్ప-2’ ఫైనల్ వర్క్ జరుగుతుండగా.. మూడో పార్ట్ టైటిల్ లీక్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే తరహాలో ‘అఖండ’ మూడో పార్ట్ టైటిల్‌ను తమన్ లీక్ చేశారని అంతా భావిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టి బాలయ్య అభిమానులు గుడ్ న్యూస్ తెలిపాడు. ఓ పిక్ షేర్ చేయగా.. అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, బాలయ్య అభిమానులు మూడో పార్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను థియేటర్స్‌లో చివరగా వేసి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు. అందుకే తమన్ ఈ విధంగా హింట్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ లీక్ అయిన టైటిల్ నిజమో కాదా? అనేది ‘అఖండ-2’థియేటర్స్‌లో స్పష్టం కానుంది. అయితే ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే బాలయ్య అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.

link

Next Story