- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీ నుంచి డబుల్ ధమాకా.. ఆసక్తికరంగా మేకర్స్ పోస్ట్
ఇటీవల కాలంలో ఊహించని వారు జతకడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు.

దిశ, సినిమా: ఇటీవల కాలంలో ఊహించని వారు జతకడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు. అలాంటి లిస్ట్‌లోకి తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), ఈషా రెబ్బా (Isha Rebba)కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓం శాంతి శాంతి శాంతి:’(Om Shanthi Shanthi Shanthi). డైరెక్టర్‌గా ఎన్నో మంచి హిట్ మూవీస్ అందించిన డైరెక్టర్ తరుణ్ ఈ మూవీతో హీరోగా మారనున్నారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో రాబోతుంది. మూవీ వర్స్ స్టూడియోస్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషా, తరుణ్ జంటగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘జయజయ జయహే’కి రీమేక్‌గా రాబోతుండటం విశేషం. ఇందులో బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవల షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ డిసెంబర్ 8న విడుదల కానుందని తెలిపారు.
అలాగే ‘ఓం శాంతి శాంతి శాంతి’ వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు పోస్టర్ ద్వారా ఫైనల్ చేశారు. ‘‘మా గోదారొళ్ళకి ఎటకారం, మమకారం తో పాటు పట్టుదల కూడా కూసంత ఎక్కువే...ఆయ్’’ క్యాప్షన్ జత చేస్తూ.. తరుణ్, ఈషా మధ్య తగ్ వార్ జరగబోతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో భార్యభర్తలుగా కనిపించగా.. పెళ్లి బట్టల్లోనే ఇరు కుటుంబాలు ఓ తాడును పోటాపోటీగా లాగుతూ కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.






