- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను తక్కువ అంచనా వేయకండి.. ‘కల్కి-2’ మూవీలో నా విశ్వరూపం చూస్తారు: దిశా పటాని
మొదటి భాగంలో నా పాత్ర చాలా చిన్నది, కేవలం ఒక సాంగ్‌కే పరిమితమయ్యాను. కానీ ‘కల్కి-2’లో నా స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస పెట్టి భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద సినిమా ‘కల్కి 2898 AD’ కి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి-2’(Kalki-2). దర్శకుడు నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించింది. ఇప్పుడు అంతకు మించి ఉండేలా సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani), రెండో భాగంలో తన పాత్ర గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
మొదటి భాగంలో కేవలం ఒక పాట, కొన్ని సీన్లకే పరిమితమైన దిశా, సీక్వెల్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘‘మొదటి భాగంలో నా పాత్ర చాలా చిన్నది, కేవలం ఒక సాంగ్‌కే పరిమితమయ్యాను. కానీ ‘కల్కి-2’లో నా స్క్రీన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నా పాత్రను తక్కువ అంచనా వేయకండి.. మీరు ఊహించని విధంగా ఉండబోతోంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించే టాకీ పార్ట్ (డైలాగ్ సీన్లు) ఈసారి ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే నేను షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.
మొదటి భాగంలో ప్రభాస్ సరసన కాసేపు మెరిసిన దిశా, రెండో భాగంలో కథలో కీలకం కాబోతుండటం ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా తమ విశ్వరూపాన్ని చూపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. నాగ్ అశ్విన్ ఈసారి హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ‘కల్కి-2’ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.






