- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలివైన దాన్ని కాదని నన్ను తక్కువ అంచనా వేయకండి.. తమన్నా సెన్సేషనల్ కామెంట్స్
నేను కేవలం అందంగా ఉన్నాననో లేక తెల్లగా ఉన్నాననో నాకు అవకాశాలు వస్తాయని నేను ఎప్పుడూ భ్రమపడలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందాలతో, మెరుపు తీగలాంటి స్టెప్పులతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది తమన్నా భాటియా(Tamannah Bhatia). పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది. అయితే, కేవలం గ్లామర్ మాత్రమే తనను ఇక్కడ నిలబెట్టిందని అనుకుంటే పొరపాటేనంటోంది ఈ భామ. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని గెలుపోటములపై, తన కెరీర్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదని తమన్నా చాలా స్పష్టంగా చెప్పింది. ‘‘ప్రతి శుక్రవారం ఇక్కడ అంతా మారిపోతుంది. మీరు ఎంత కాలంగా పనిచేస్తున్నారు లేదా ఎంత గొప్పగా చేశారు అన్నది పక్కన పెడితే.. ఆ వారం విడుదలయ్యే సినిమా మీ తలరాతను మారుస్తుంది.
ప్రజలు మిమ్మల్ని చూసే విధానం కూడా ఆ సినిమా ఫలితాన్ని బట్టే ఉంటుంది. అందుకే ఈ పరిశ్రమ ఎవరికైనా వినయాన్ని నేర్పుతుంది’’ అని ఆమె అభిప్రాయపడింది. అంటే, ఇక్కడ సక్సెస్ ఉన్నప్పుడే గౌరవం ఉంటుందని, అది మనల్ని ఎప్పుడూ నేల మీద ఉండేలా చేస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారిని కేవలం వారి అందం చూసే జనం ఇష్టపడతారని ఒక టాక్ ఉంటుంది. కానీ తమన్నా దీనిపై తనదైన శైలిలో స్పందించింది. ‘‘నేను కేవలం అందంగా ఉన్నాననో లేక తెల్లగా ఉన్నాననో నాకు అవకాశాలు వస్తాయని నేను ఎప్పుడూ భ్రమపడలేదు. కేవలం గ్లామర్ బొమ్మని కాదు. అలా ఎవరైనా నాకు పని ఇస్తారని తప్పుడు అంచనా కూడా వేయలేదు. అదే సమయంలో, నేను తెలివైన దాన్ని కాదని ఎవరైనా అనుకున్నా నాకు ఎప్పుడూ సమస్యగా అనిపించలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని కొత్త భామలు పోటీకి వచ్చినా తమన్నా ఇంకా టాప్ రేసులో ఉంది.
కేవలం గ్లామర్ మీద ఆధారపడకుండా, నటనలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 2026 సంవత్సరంలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టింది. వేసవి కానుకగా మే 15, 2026న సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన 'వ్యాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvan) థియేటర్లలోకి రాబోతోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటిస్తున్న 'రెంజర్' (Ranger) డిసెంబర్ 4, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం తమన్నా మునుపెన్నడూ చూడని రీతిలో ఫైట్స్ కూడా చేసినట్లు సమాచారం.






