పబ్లిక్‌లోనే హీరోయిన్ నడుమును చుట్టేసిన అభిమాని..

by Dishanational2 |
పబ్లిక్‌లోనే హీరోయిన్ నడుమును చుట్టేసిన అభిమాని..
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ ఆహానా కుమ్రా ఓ ఈవెంట్‌లో అన్‌కంఫర్టబుల్ సిచ్యువేషన్‌ను ఎదుర్కొంది. ఫ్యాన్స్ రిక్వెస్ట్‌తో సెల్ఫీలు ఇస్తున్న క్రమంలో ఫొటో కోసం వచ్చిన వ్యక్తి.. ఆహానా నడుముపై చేయివేసి పోజులిచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫైర్ అయిన నటి.. ‘డోంట్ టచ్ మి’ అంటూ అరిచేసింది. దీంతో వెంటనే క్షమాపణలు కోరాడు సదరు వ్యక్తి. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నటికి మద్దతిస్తున్న అభిమానులు.. బౌండరీస్ క్రాస్ చేసిన వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు. ‘అమ్మాయి పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదని తెలియదా?’ అని తిట్టిపోస్తున్నారు.

Also Read...

అతని చేతిలో దారుణంగా మోసపోయిన కాజల్ చెల్లి.. అందుకే ఇండస్ర్టీకి దూరం..


Next Story

Most Viewed