ప్రేక్షకులకు చెత్తను చూపించకండి.. తప్పుడు సినిమాలపై పార్వతి ఘాటు విమర్శలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-25 17:39:01  IST  )

బాలీవుడ్‌లో బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల మేము కొత్త ప్రయోగాలు చేయలేము అని చెప్పడం ఒక సాకు మాత్రమే.

ప్రేక్షకులకు చెత్తను చూపించకండి.. తప్పుడు సినిమాలపై పార్వతి ఘాటు విమర్శలు
X

దిశ, సినిమా: ప్రముఖ నటి పార్వతీ తిరువోతు మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమలో చర్చకు తెరలేపారు. ముఖ్యంగా సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ ఎందుకు వెనుకబడి ఉందో ఆమె తనదైన శైలిలో వివరించారు."బాలీవుడ్‌లో బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల మేము కొత్త ప్రయోగాలు చేయలేము అని చెప్పడం ఒక సాకు మాత్రమే. నిజానికి ఎక్కువ డబ్బు ఉన్నప్పుడే మనం ఏదైనా కొత్తగా చేసే అవకాశం ఉంటుంది. కానీ, అక్కడ ధైర్యం కంటే అత్యాశే ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం లాభాల కోసమే చూస్తూ సమాజానికి హాని చేసే సినిమాలను తీస్తున్నారు" అని ఆమె బాలీవుడ్ మేకర్స్‌ను కడిగిపారేశారు. ప్రాంతీయ సినిమాల్లో (సౌత్) బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, కథాంశం విషయంలో చూపే ధైర్యం అమోఘమని ఆమె కొనియాడారు. సమస్యాత్మకమైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంపై ఆమె స్పందిస్తూ.. ఇది మన సమాజ స్థితిగతులకు నిదర్శనమని అన్నారు. "మనం గొప్ప సంస్కృతి అని డప్పు కొట్టుకుంటాం కానీ, మన సంస్కృతిలో ఉన్న చీకటి కోణాలను చూడటానికి ఇష్టపడము. ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారంటే అది మన పెంపకంలోనో, మన ఆలోచనల్లోనో ఉన్న లోపం" అని పార్వతి నిర్మొహమాటంగా చెప్పారు. సినిమా వాళ్లు మనకి చెత్త చూపిస్తున్నప్పుడు, అది మాకు వద్దు అని చెప్పే అధికారం ప్రేక్షకులకే ఉందని ఆమె నొక్కి చెప్పారు. అలాంటి సినిమాలను చూడటం మానేసినప్పుడే మేకర్స్‌లో మార్పు వస్తుందని, అప్పుడే నాణ్యమైన సినిమాలు పుట్టుకొస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సంపాదించిన కోట్లలో కొంత మొత్తమైనా సమాజానికి మేలు చేసే చిత్రాల కోసం కేటాయించాలని ఆమె ఇండస్ట్రీ పెద్దలకు సూచించారు.

Read More.. ఊహించని లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. ‘క్యాస్ట్’లో ఆమె ఉగ్రరూపాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలంటూ మేకర్స్ పోస్ట్

Next Story