నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన.. Sunishith

by Disha Web Desk 6 |
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన.. Sunishith
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పరిచయం అయిన శాక్రిఫైసింగ్ సునిశిత్ టాప్ హీరోలపై పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల రామ్ చరణ్, సతీమణి ఉపాసనపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఉపాసనతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లానని సునిశిత్ చెప్పుకొచ్చాడు. దీంతో అది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అతడిని చితకొట్టడంతో క్షమాపణ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే జూ.ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ మరో ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. కానీ, అతను అశ్లీల చిత్రాల్లో నటించారు. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవ్వరూ చెప్పరు. సునిశిత్ అనే హీరో తప్ప’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలు విన్న తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో భయపడిన సునిశిత్ ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పాడు. ‘‘ నన్ను నా ఫ్యామిలీని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. తారక్‌పై చేసిన కామెంట్స్‌కి క్షమాపణ కోరుతున్నా. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను. నేను కూడా తారక్ అభిమానినే. కానీ, పబ్లిసిటీ వస్తుందని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా. ఇకపై నా నుంచి ఇలాంటివి ఉండవు’’ అని సునిశిత్ ఓ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More... జూ.ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చంద్రబాబు ప్లాన్

Read More... తారక్ భార్య లక్ష్మీ ప్రణతిని దారుణంగా తిట్టిపోసిన నెటిజన్స్..



Next Story

Most Viewed