- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవన్నీ రూమర్లే నమ్మకండి.. త్రివిక్రమ్ సినిమాలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ.. వైరల్‌గా మారిన ట్వీట్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) గత ఏడాది ‘గుంటూరు కారం’ చిత్రంతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) గత ఏడాది ‘గుంటూరు కారం’ చిత్రంతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్(Allu Arjun)తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan), వెంకటేష్ వంటి స్టార్స్‌తోనూ సినిమాలు చేయనున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయంపై నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి వెంకటేష్‌తో చేయనున్నారు.
అలాగే మరొకటి ఎన్టీఆర్ అన్నతో తెరకెక్కించనున్నారు. అవి కాకుండా వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ త్రివిక్రమ్‌కు సంబంధించిన మరేదైనా ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే నేను స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తాను. కానీ రూమర్స్ ప్రచారం చేయకండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తోంది. వీరిద్దరితో ఎలాంటి జోనర్‌లో సినిమా చేయనున్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.






