- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిని నమ్మి మోసపోకు.. ఇండస్ట్రీ నిన్ను ఎదగనివ్వరంటూ యంగ్ హీరోను హెచ్చరిస్తూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరో మౌళి, శివాని నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts).

దిశ, సినిమా: యంగ్ హీరో మౌళి, శివాని నాగరం (Shivani Nagaram)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ మూవీపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా, ‘లిటిల్ హార్ట్స్’ మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాలకు, కన్నీళ్లకు ప్రిపేర్ అయి రావాలి. ఇండస్ట్రీలో ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన వందల కోట్లలో లాభాలు మాత్రమే దక్కించుకుంటారు.
ఒక స్టార్ కమెడియన్ కు కొడుకుగా, ఒక మెగాస్టార్ కు బావమరిదిగా, ఒక ఐకాన్ స్టార్ కు తండ్రిగా వంద కోట్లకు ఎవరో ఒకరు మాత్రమే పుడతారు. కాలు మీ కాలు వేసుకొని ఉంటాడు. ఇలాంటి జీవితం అందరికీ రాదు. అల్లు అరవింద్ లాంటి వ్యక్తిని నా జీవితంలో ఇప్పటివరకు చూడలేదు. కష్టపడకున్నా డబ్బులు మాత్రం వస్తాయి. మౌళి మహేష్ బాబు ట్వీట్ వేశాడని.. విజయ్ షర్ట్ ఇచ్చాడని నమ్మకు. ఇలాంటివన్నీ అబద్ధాలు. టాలెంట్‌ను మాత్రమే నమ్ముకోవాలి.. పొగడ్తలను కాదు. ఏ మాత్రం సైడ్ అయినా ఇండస్ట్రీ నిన్ను బ్రతనివ్వదు. సక్సెస్‌కి ముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే సక్సెస్ తర్వాత కొనసాగితేనే నటుడిగా నిన్ను ఇండస్ట్రీలో ఉండనిస్తారు. లేదంటే ఎదగనివ్వకుండా దూరం చేస్తారు’’ అని హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.






