నా ప్రాజెక్ట్స్‌లో హీరో ఎవరు అని అడగకండి.. ఇకపై నేను అలాంటి సినిమాలు చేయనంటూ సమంత సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

నా ప్రాజెక్ట్స్‌లో  హీరో ఎవరు అని అడగకండి.. ఇకపై నేను అలాంటి సినిమాలు చేయనంటూ సమంత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సరికొత్త మేకోవర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ప్రముఖ 'ది నాడ్' మ్యాగజైన్ మే 2026 కవర్ షూట్ కోసం ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మెటాలిక్ గౌన్లు, ముత్యాలతో డిజైన్ చేసిన ఖరీదైన దుస్తుల్లో సమంత ఒక దేవకన్యలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మంచు దిమ్మెల మధ్య అద్దాల మెరుపులతో ఉన్న డ్రెస్సులో ఆమె ఇచ్చిన పోజులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె లుక్ చూస్తుంటే ఎవరైనా సరే కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో షూట్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. షూటింగ్ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో హీరోల ప్రాధాన్యత గురించి ఆమె మాట్లాడుతూ.. "మీ సినిమాలో హీరో ఎవరు?" అని ఎవరైనా అడిగితే, "నేను ఇకపై అలాంటి సినిమాలు చేయడం లేదు అని చెప్తాను" అని చాలా కూల్‌గా బదులిచ్చారు. ఆమె ఉద్దేశంలో కథే అసలైన హీరో.

నటీనటుల కంటే కథే గొప్పదని, మహిళల ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండే పాత్రలనే తాను ఇకపై ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఒక నటిగా మాత్రమే కాకుండా, సినిమాల్లో మార్పు కోసం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె నిరూపిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, సమంత స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న విడుదల కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సమంత ఒక కొత్త పెళ్లికూతురిగా కనిపిస్తూనే, తన వెనుక ఉన్న ఒక బలమైన యాక్షన్ గతాన్ని రివీల్ చేయబోతున్నారు. గ్లామరస్ ఫోటోషూట్‌లతో కుర్రకారును అలరిస్తూనే, 'మా ఇంటి బంగారం' వంటి వైవిధ్యమైన సినిమాలతో నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని సమంత చూస్తున్నారు. అందం, అభినయం, అద్భుతమైన ఆలోచనలతో సమంత మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story