‘డాన్-3’ మూవీ మేకర్స్ నన్ను సంప్రదించలేదు.. తప్పుడు వార్తలు నమ్మకండి: షారుఖ్ ఖాన్

by Mallepaka Hamsa |

‘డాన్-3’ టీమ్ అస్సలు సంప్రదించలేదు.. పుకార్లు నమ్మకండి.

‘డాన్-3’ మూవీ మేకర్స్ నన్ను సంప్రదించలేదు.. తప్పుడు వార్తలు నమ్మకండి: షారుఖ్ ఖాన్
X

దిశ, సినిమా: ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) దర్శకత్వంలో వచ్చిన డాన్, డాన్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ రెండు భాగాల్లో షారుఖ్ ఖాన్ తనదైన నటనతో డాన్ పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అయితే.. ఇటీవల ‘డాన్-3’ (don-3)అనౌన్స్ చేసినప్పుడు, షారుఖ్ స్థానంలో యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ పేరు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు కూడా మొదలయ్యాయి. రణ్‌వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, మళ్ళీ ఆ పాత్రలోకి షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)వస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. షారుఖ్ అభిమానులు ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగి అసలు విషయం వెల్లడించారు. 'డాన్-3' గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘ఇవన్నీ కేవలం ఎవరో సరదాగా సృష్టించిన పుకార్లు మాత్రమే. వాటిని అస్సలు నమ్మకండి. ‘డాన్-3’ టీమ్ అస్సలు సంప్రదించలేదు నా దగ్గరకు రాలేదు.అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి సెన్సేషనల్ వార్తలను ప్రచారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. దీంతో రణ్‌వీర్ స్థానంలో షారుఖ్ వస్తున్నారనే పుకార్లకు చెక్ పడింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ‘డాన్’గా అలరించబోతున్నారు. ఆయనకు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని మరింత స్టైలిష్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Next Story