అరవింద స్వామికి అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..?

by samatah |
అరవింద స్వామికి అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..?
X

దిశ, సినిమా: కెరీర్ ఆరంభం నుంచు తక్కువ సినిమాలే చేసినా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అరవింద స్వామి. అప్పట్లో అతని అందానికి ఫిదా అవ్వని వారంటూ లేరు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్ లో ఉండేది. అయితే ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, యాక్షన్ పాత్రలు ఎంచుకుంటూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు అరవింద స్వామి. ఇక పోతే తాజాగా ఈ హీరో ఆస్తుల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అరవింద స్వామి 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ.. అరవింద స్వామి మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.4000 కోట్లు అని భోగట్టా. ఒక్క కంపెనీ ద్వారా ఈ స్టార్ హీరో 3,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని సొంతం చేసుకున్నారని ఆ కంపెనీ పేరు ట్యాలెంట్ మ్యాక్సిమమ్( Talent maximum ) అని సమాచారం. అలాగే అరవింద స్వామికి సొంతంగా ఆస్పత్రులు ఉండగా వాటి ద్వారా కూడా కళ్లు చెదిరే ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది.

Read More: ‘పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సాక్షం’.. (వీడియో)

Next Story

Most Viewed