వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటివా..? యాక్టర్.. రాజమౌళికి పిచ్చెక్కించేశాడు.. (వీడియో)

by Disha Web Desk 7 |
వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటివా..? యాక్టర్.. రాజమౌళికి పిచ్చెక్కించేశాడు.. (వీడియో)
X

దిశ, సినిమా : డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా.. ఇండియాలో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. రీల్స్, షాట్స్‌తో కరోనా టైంలో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఇక ఇంతకుముందు సన్ రైజర్స్ టీమ్‌కు ఆడి హైదరాబాదీలకు బ్రదర్ అయిపోయిన ఆయన... ఇప్పుడు వార్నర్ ఏకంగా యాక్టర్‌గా మారాడు. Cred UPI యాడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి నటించాడు.

ఇక ఈ యాడ్‌లో ముందుగా జక్కన్న కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు. అది కావాలంటే తనకు సినిమా చాన్స్ ఇవ్వాలని కోరుతాడు వార్నర్. RRR, మగధీర సినిమా గెట్ అప్స్‌లో కనిపించిన ఆయన.. దారుణంగా నటించి జక్కన్నకే ఇరిటేట్ తెప్పిస్తాడు. దీంతో చివరగా తాను cred UPI కి అప్ గ్రేడ్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పడంతో యాడ్ అయిపోతుంది. మొత్తానికి నార్మల్ upi యూజ్ చేస్తే డేవిడ్ వార్నర్ యాక్టింగ్‌లా.. cred UPI వినియోగిస్తే అసలు హీరోల్లా ఉంటుందనేది యాడ్ మీనింగ్. కాగా నెటిజన్స్ ఈ యాడ్‌కు ఫిదా అయిపోయారు. రాజమౌళి ప్రాజెక్ట్‌లో వార్నర్‌ను చూడాలని ఉందని అంటున్నారు.

Read More : భార్యతో ఇదే పనా.. సినిమాలు చేసేది లేదా ఇక.. రాజమౌళిపై నెట్టింట దారుణమైన ట్రోల్స్


స్టార్ హీరో బాలకృష్ణ ఫస్ట్ లవ్.. అనూహ్యంగా భార్య అయిపోయిన వసుంధర.. అసలు ఏం జరిగిందంటే?


Next Story