'సీతారామం' హీరోయిన్ ఫుల్ ఖుష్.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 6 |
సీతారామం హీరోయిన్ ఫుల్ ఖుష్.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన సక్సెస్ టాలీవుడ్‌లో 'సీతారామం' మూవీ రూపంలో అందుకుంది. ఆగస్టు 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో మృణాల్.. సీతగా సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరిచి ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటుంది.ఇక పోతే ఈ భామ మరో హ్యాపీ మూమెంట్‌ను అభిమానులతో పంచుకుంది. తాను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా కూడా 'సీతా రామం' ట్యాగ్ ట్రెండింగ్‌లో కనిపిస్తుండటం చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది.

Also Read: ఆమె అందం, అభినయానికి ఫిదా అయ్యా: తేజస్విపై మౌనీ ప్రశంసలు

Next Story

Most Viewed