వెంకీ 'సైంధవ్' లో గెస్ట్ రోల్ చేస్తుంది ఎవరో తెలుసా..?

by Disha Web Desk 1 |
వెంకీ సైంధవ్ లో గెస్ట్ రోల్ చేస్తుంది ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేశ్ హీరోగాజ.. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సైంధవ్'. కొన్ని రోజులుగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాని కీలక పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు, సైంధవ్‌లో నాని అతిధి పాత్రలో నటించనున్నట్లు నాని స్వయంగా ఇన్ స్టాగ్రామ్‌ లో వెల్లడించారు. ఈ సినిమా డిసెంబరు 22, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


Next Story

Most Viewed