ప్రాచీన కాలంలో స్త్రీలు సెక్స్ గురించి ఏం మాట్లాడుకునే వారో తెలిస్తే.. ఫ్యూజ్‌లు అవుట్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |

కొన్నింటి గురించి మాట్లాడుకోవడానికి ఎలాంటి మొహమాటం ఉండదు. కానీ టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, రోజు రోజుకు సమాజంలో మార్పు చోటు చేసుకుంటున్నా, ఇప్పటికీ కొంతమంది సెక్స్, పీరియడ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి మాత్రం

ప్రాచీన కాలంలో స్త్రీలు సెక్స్ గురించి ఏం మాట్లాడుకునే వారో తెలిస్తే.. ఫ్యూజ్‌లు అవుట్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : కొన్నింటి గురించి మాట్లాడుకోవడానికి ఎలాంటి మొహమాటం ఉండదు. కానీ టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, రోజు రోజుకు సమాజంలో మార్పు చోటు చేసుకుంటున్నా, ఇప్పటికీ కొంతమంది సెక్స్, పీరియడ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఓపెన్‌గా శృంగారం గురించి చర్చించరు. అయితే ప్రాచీన కాలంలో మాత్రం దీని గురించి మహిళలు ఓపెన్‌గా మాట్లాడుకునే వారు అంటున్నారు కొందరు.

పురాతన కాలంలో కొంత మంది మహిళలు సెక్స్ చిట్కాల లాంటి ఆలోచనలు కాగితంపై పెట్టినట్లు తెలుస్తోంది. గ్రీకు మహిళా తత్వవేత్త అయిన థియానో ఆమె స్నేహితురాలు యూరిడైస్‌కు కొన్ని సహాలు ఇస్తుంది. అందులో ఒక స్త్రీ తన భర్త పడక మీదకు వచ్చినప్పుడు సిగ్గును, దుస్తులను విడిచిపెట్టాలని ఓ లేఖలో రాస్తుందంట. అయితే దీన్ని చూసిన కొందరు పురాతన కాలంలో స్త్రీలు సెక్స్ గురించి అలాంటి విషయాలు చర్చించుకునేవారు అంటూ పేర్కొన్నారు. ఇక ఎలిఫాంటిస్ అనే గ్రీక్ కవయిత్రి స్త్రీలకు సెక్స్ చిట్కాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం, ఆసక్తి ఎక్కువ అంట. అయితే ప్రాచీన కాలంలో మహిళల గురించి అనేక విషయాలను వెల్లడించారు. కొందరు మహిళలను గొప్పగా చిత్రీకరిస్తే, మహిళా ద్వేషులైన పురుష రచయితలు మాత్రం వారిని తక్కువ చేస్తూ రాసి చూపించారంట. అయితే వారిని తోసిపుచ్చుతూ.. పురాతన కాలంలో సెక్స్ గురించి స్త్రీల అభిప్రాయం ఎలా ఉండేది అనే విషయాలపై పుస్తక రచయిత డైసీ పరిశోధించారు. ఆయన చాలా విషయాలను వెల్లడించారు. కొందరు ఆ కాలంలో స్త్రీని చాలా అద్భుతంగా చూపెట్టారు. ఎందుకంటే సాధారణంగా ప్రాచీన కాలంలో స్త్రీలు ముసుగు వేసుకొని కనిపించేవారు. అలాగే ఏదైనా అవసరం పడి బయటకు వెళ్తే తన తండ్రి భర్త, సోదరుడు తోడుగా వెళ్లేది. అంత గొప్పగా ఆడవారిని చూసుకునే వారు. మరి ఆ రోజుల్లో స్త్రీ కామవాంఛ అనేది ఒక కల్పితమేనా అని కొందరి వాదన. ( నోట్ : ఇది ఇంటర్నెట్‌లో సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Next Story