రామ్ చరణ్ తన ఫోన్‌లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడంటే?

by Disha Web Desk 8 |
రామ్ చరణ్ తన ఫోన్‌లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడంటే?
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నందమూరి వారసుడు తారక్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ ఎంత పెద్ద విజయం అందుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆస్కార్ అవార్డునే సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వీరి స్నేహం మరింత ఎక్కువ అయింది. దీంతో వీరంటే ఫ్యాన్స్‌కు కూడా చాలా అభిమానం ఏర్పడింది. ఇక ఇందతపక్కన పెడితే, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు.ఈ క్రమంలోనే చెర్రీ, మొబైల్‌లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలిపారు.చరణ్ మాట్లాడుతూ.. తారక్ నెంబర్‌ని నేను నా మొబైల్ ఫోన్‌లో తార్ అని సేవ్ చేసుకున్నానని పేర్కొన్నాడు. ఇక చరణ్ మొబైల్ లో చాలామంది నేమ్స్ షార్ట్ కట్ ఫామ్ లోనే ఉంటాయట. ఈ విషయాన్ని రామ్ చరణ్ నే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed