పెళ్లికి వచ్చిన అతిథులకు పరిణీతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?

by Disha Web Desk 10 |
పెళ్లికి వచ్చిన అతిథులకు పరిణీతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?
X

దిశ, సినిమా: తాజాగా బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా, రాఘవ్ చద్దా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో జరిగిన వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక ఈ పెళ్లికి తన సోదరి అనమ్‌తో కలిసి హాజరైన సానియా మీర్జా ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫొటోలో సానియా మీర్జా చేతిలో ఉన్న వైట్ హ్యాండ్ కర్చీఫ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ‘మా పెళ్లి చూశాక మీకు కన్నీళ్లు వస్తే.. ఈ హ్యాండ్ కర్చీఫ్‌తో కన్నీళ్లు తుడుచుకోండి’ అని అందులో రాసి ఉంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. ఎవరి స్టైల్‌లో వారు పరిణీతిని ఆడేసుకుంటున్నారు. ‘ఇది కాస్త ఓవర్ అయిందనుకుంటా’ అని కొందరంటే.. ‘డబ్బులు ఉన్నందున అటకపై ఎక్కేశావు’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.



Next Story