'దసరా' 8 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతో తెలుసా..?

by Disha Web Desk 1 |
దసరా 8 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. మూవీ విడుదలైన అన్న చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రూ.55.17 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటించింది.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే కర్ణాటకలో రూ.4.20 కోట్లు, ఇతర భాషల్లో రూ.1.40 కోట్లు, ఉత్తర భారతదేశంలో రూ.1.76 కోట్లు, ఓవర్సీస్ లో రూ.9.60 కోట్లు, అదేవిధంగా వరల్డ్ వైడ్ గా రూ.55.17 కోట్లు వసూలు చేసింది.

Next Story

Most Viewed