Mr. Perfect : సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

by Disha Web Desk 9 |
Mr. Perfect :  సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్-దశరథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’. ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఫేవరేట్‌గా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కజాల్ అగర్వాల్.. సెకండ్ హీరోయిన్‌‌గా తాప్సీ పన్ను నటించారు. అయితే ఈ మూవీలో కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసేదానికంటే ముందే.. దర్శక, నిర్మాతలు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను సంప్రదించారట. కానీ అప్పటికే మిల్కీ బ్యూటీ చేతినిండా సినిమాలు ఉండడంతో ఇందులో నటించడానికి డేట్లు కుదరలేదట. ఈ కారణంగా ఆ మూవీకి నో చెప్పిందట.

కాగా ‘‘ఆ సినిమా చూశాక ఎంతో బాధపడ్డాను. అంత బాగా నచ్చింది సినిమా. మూవీ చూశాక మాత్రం టైమ్ కుదుర్చుకుని ఉండాల్సిందని అనుకున్నాను.’’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Read More : చ‌ర‌ణ్‌తో మాట్లాడితేనే నా మ‌న‌సు కుదుట ప‌డుతుంది : Tamannaah Bhatia



Next Story

Most Viewed