Renu Desai: రేణుదేశాయ్ తో అలా చెప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా?

by Phanindra |   (  Updated:2023-08-14 10:14:40  IST  )

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే.

Renu Desai:  రేణుదేశాయ్ తో అలా చెప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే. ఈ వీడియోలో నా సపోర్ట్ ఎప్పుడూ పవన్ కు ఉంటుందంటూ చెప్పుకొచ్చింది.భార్యగా తాను నన్ను బాధ పెట్టినా, కానీ పవన్ కళ్యాణ్ తనకెంతో ఇష్టమనీ, లగ్జరీ లైఫ్‌నీ వదిలేసుకుని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కోసం రాజకీయాల్లోకి వచ్చారు, ఆయనకు తన మద్దతూ ఎప్పుడు ఉంటుందని రేణూ దేశాయ్ తన మాటల్లో చెప్పుకొచ్చింది.

సమయం, సందర్భం లేకుండా రేణూ దేశాయ్ ఈ వీడియో ఎందుకు విడుదల చేసింది? గతంలో పవన్ మీద నెగిటివ్ ఆరోపణలు చేసి ఓ వీడియో వదిలింది, ఇప్పుడెమో నా ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే అంటుంది.. ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చించుకుంటున్నారు.. ఆమెతో ఎవరైనా కావాలని ఇలా చెప్పించి ఉంటారా అని అనుమానాలు వస్తున్నాయి. కొన్ని వర్గాల వారు దీని వెనుక ఎవరో ఉన్నట్టు అనుకుంటున్నారు. దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Read More: కోట్లు సంపాదించినా ఏం లాభం అంటూ.. Anchor Sumaని ఏకిపారేస్తున్న నెటిజెన్స్? కారణం ఇదే!

Next Story