చిరు, బాలయ్య, వెంకటేష్​ నటించిన సినిమా ఏంటో తెలుసా

by Disha Web Desk 15 |
చిరు, బాలయ్య, వెంకటేష్​ నటించిన సినిమా ఏంటో తెలుసా
X

దిశ, వెబ్​డెస్క్​ : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరినీ ఒకే సినిమాలో ఎప్పుడైనా చూశారా. వారిద్దరూ కలిసి ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు...అలాంటప్పుడు ఎలా చూస్తాం అనే కదా మీ సమాధానం. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారనేది చాలా మందికి తెలియదు. చాలా మందికి కాదు నూటికి 98 శాతం మందికి తెలియదు. కానీ వీరు చాలా సంవత్సరాల క్రితమే ఓ సినిమాలో నటించారు. వీరిద్దరే కాదు ఈ సినిమాలో ఐదారుగురు ప్రముఖ హీరోలు నటించారు.

ఆ సినిమానే త్రిమూర్తులు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి జోష్ లో ఉన్నారు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ.. వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లను అందుకున్నారు. చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 150కి పైగా సినిమాల్లో నటించి... కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాని రవితేజతో కలిసి నటించి హిట్ కొట్టాడు. ఇక బాలయ్య కూడా నందమూరి తారకరామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ స్టాపబుల్ షోతో బుల్లితెరపై కూడా సందడి చేశాడు. ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

వీరిద్దరూ నటించిన సినిమా....

విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన సినిమా త్రిమూర్తులు. ఈ సినిమాలో బాలకృష్ణ, చిరంజీవి కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, శోభన్ బాబు కూడా నటించారు. ఈ సినిమా తరువాత మళ్లీ బాలయ్య, చిరు కలిసి నటించలేదు. మంచి కథ దొరికితే రాబోయే రోజుల్లో వీరు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని ఇండస్ట్రీ టాక్​. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. వీరిద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమధ్య అన్ స్టాపబుల్ షోలో కూడా అల్లు అరవింద్, రాఘవేంద్రరావు మాట్లాడుతూ బాలయ్య, చిరంజీవి కలిసి సినిమా తీస్తే.. పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అని అన్నారు.

Read More..

Pawan kalyan instagram : ఇన్‌స్టాలో పవన్ ఫస్ట్ పోస్ట్ ఏంటో తెలుసా?

Niharika: విడాకుల అనంతరం నిహారిక మెడలో తాళి ఏం చేసిందో తెలుసా?



Next Story