చంద్రమోహన్ చనిపోవడానికి కారణమేంటో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2023-11-11 08:55:47  IST  )

టాలీవుడ్ దిగ్గజ నటుడు చంద్రమోహన్ నేడు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే.

చంద్రమోహన్ చనిపోవడానికి కారణమేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దిగ్గజ నటుడు చంద్రమోహన్ నేడు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆయనను తలుచుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు చంద్రమోహన్ ఎలా చనిపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై ఆయన మేనల్లుడు కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ‘‘ నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్ గుండె సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటుండగా కిడ్నీలపై ప్రభావం పడింది. అందుకే ఈ రోజు ఉదయం ఆసుపత్రికి తరలించాము. కానీ 9.45 గంటలకు మృతి చెందారు అని తెలిపాడు. ఇక ఆయన అంత్యక్రియలు చిన్న కుమార్తె USA నుంచి వచ్చాక సోమవారం నాడు నిర్వహించనున్నట్లు సమాచారం.

Read More..

చంద్రమోహన్‌తో ఒక్కసారి చేస్తే చాలు.. పడిచచ్చిన అలనాటి హీరోయిన్లు..

Next Story