'Godfather'‌కు Salman Khan రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?

by Chukka Sudharani |   (  Updated:2022-09-15 14:33:02  IST  )

Salman Khan may have taken Rs 40 Crore Remuneration for Megastar Chiranjeevi Godfather Movie

Godfather‌కు Salman Khan రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతుండగా.. మెగాస్టార్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకునే సల్మాన్.. 'గాడ్ ఫాదర్' కోసం ఏకంగా రూ.40 కోట్ల అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నందున అక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్.

రామ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బిగ్ అప్‌డేట్ ఇచ్చిన Gautham Menon

Next Story