టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

by Anjali |
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోని హీరోయిన్లు అందరూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. వారి వ్యక్తిగత, వృత్తిపర విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. వీరికి భారీ ఫాలోవర్స్ ఉంటారు. ఒక్కో సెలబ్రిటీకి మిలియన్ సంఖ్యలో అనుచరులు ఉండటం విశేషం. కొంతమంది సెలబ్రిటీలు పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ పోస్టులు కూడా పెడుతారు. ఒక్కో పోస్టుకు భారీగానే సంపాదించుకుంటారని సమాచారం. టాలీవుడ్ హీరోయిన్ల సంపాదన విషయానికొస్తే..

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతకు 30 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఏమైన పోస్ట్ పెడితే 50 లక్షల రూపాయల వరకు సంపాదించుకుంటారట.

నేషనల్ క్రష్ రష్మిక ఒక్కో పోస్టుకు రూ. 30 లక్షల వరకు పారితోషికం అందుకుంటారట. విజయ్ దేవరకొండ ఇన్‌స్టా వేదికన ఏదైన బ్రాండ్ ప్రమోట్ చస్తే కోటి రూపాయల వరకు పారితోషికం అందుకుంటారని టాక్. మహేష్ బాబు సుమారు రూ. 2 కోట్ల వరకు సంపాదించుకుంటారట. అలాగే కాజల్ అగర్వాల్ ఒక పోస్ట్‌కు 50 లక్షల రూపాయల నుంచి కోటి వరకు పారితోషికం తీసుకుంటారట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

Next Story

Most Viewed