'కార్తీకదీపం' సీరియల్‌కు వంటలక్క, డాక్టర్ బాబు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకున్నారో తెలుసా ?

by Disha Web Desk 10 |
కార్తీకదీపం  సీరియల్‌కు  వంటలక్క, డాక్టర్ బాబు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకున్నారో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీకదీపం . ఈ సీరియల్ కు వచ్చిన క్రేజ్ ఈ సీరియల్ కూడా రాలేదు. టిఆర్‌పి రేటింగ్స్ విషయంలో కూడా తగ్గలేదు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు అభిమానులే. సీరియల్లో బాగా ఆకట్టుకున్న పాత్రలు ఏమిటంటే వంటలక్క , డాక్టర్ బాబు , మోనిత. వంటలక్క పాత్రకు అయితే ఎన్ని మార్కులు వేసినా తక్కువే. భర్త అనుమానించి .. అవమానిస్తున్నా కూడా సహనంగా ఎలా ఉండాలో ఆమె నటించిన పాత్రలో మనకి కనబడుతుంది. మొత్తానికి ఈ సీరియల్‌కు ముగింపు పలికారు. ఇప్పుడు అందరు చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే సీరియల్ ముగిసే వరకు నిరూపమ్ ( కార్తీక్ బాబు ) , వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్ ) రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారా అని ఆరాలు తీస్తున్నారట. కార్తీకదీపం సీరియల్ కోసం వంటలక్క ఒక్కో ఎపిసోడ్ కు రూ. 25 వేల రూపాయలు అందుకుందట. నిరూపమ్‌కు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఒక్కో ఎపిసోడ్ కు రూ.30 వేలకు తీసుకున్నారని సమాచారం.

Next Story