- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పది రోజుల్లో "బలగం" ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?
చిన్నా సినిమాల్లో బాహుబలిగా బలగం సినిమా దూసుకు పోతుంది. వేణు దర్శకత్వంలో పక్కా తెలంగాణ సంస్కృతిలో ఈ సినిమా ఉండటంతో ప్రేక్షకులకు బలే కనెక్ట్ అవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: చిన్నా సినిమాల్లో బాహుబలిగా బలగం సినిమా దూసుకు పోతుంది. వేణు దర్శకత్వంలో పక్కా తెలంగాణ సంస్కృతిలో ఈ సినిమా ఉండటంతో ప్రేక్షకులకు బలే కనెక్ట్ అవుతుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డే నుంచే మంచి టాక్ నడిచినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు తక్కవు వచ్చారు. కానీ టాక్ రోజు రోజుకు పెరిగిపోవడం.. అన్ని మీడియా చానెళ్లు అలాగే.. టాలీవుడ్ సేలబ్రేటీలు ఈ సినిమాను చూసీ ఆకాశానికి ఎత్తేయడంతో మొదటి, రెండో వీకెండ్స్‌లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.
మొత్తంగా బలగం సినిమా 10 రోజుల్లో కలిపి బాక్సాఫీస్ వద్ద.. సుమారు 7.85 కోట్లకు చేరింది. కాగా ఈ రోజు ఆదివారం కావడంతో అన్ని షోలు దాదాపు హౌస్ ఫుల్ అయినట్లు సమాచారం అందుతుంది. ఈ రోజు కలెక్షన్స్ కూడా యాడ్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల బెంచ్ మార్క్‌ను దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరో కాగా.. దిల్ రాజు నిర్మాతగా ఉన్నాడు.






