ఆ హీరోలతో Samantha ఎన్నిసార్లు Romance చేసిందో తెలుసా?

by Disha Web Desk 6 |
ఆ హీరోలతో Samantha ఎన్నిసార్లు Romance చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సీని ఇండస్ట్రీకి అందాల భామ సమంత స్టార్ హీరోయిన్ చక్రం తిప్పుతోంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థీయేటర్స్‌లో విడుదల కానుంది. అయితే సమంత తనకంటే చిన్న వయసు హీరోలతో నటించిందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఖుషిలో నటించి విజయ్ దేవరకొండకు సమంతకు మధ్య 2 ఏళ్ల ఏజ్ గ్యాస్ ఉందట.

అలాగే ఈ బ్యూటీ గత చిత్రం శాకుంతలం, గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్‌, సమంత జంటగా నటించారు. అయితే దేవ్ మోహన్ వయసు 30 ఏళ్లు. అంటే సమంత కంటే ఆరేళ్లు చిన్నోడు అన్నమాట. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సూపర్ హిట్ మూవీ ఓ బేబీ. ఇందులో సమంత, నాగశౌర్య జంటగా కనిపిస్తారు. అయితే సమంత కంటే నాగశౌర్య రెండేళ్లు చిన్నోడు. నాగశౌర్య ఏజ్ 34. ఇక 2014లో వచ్చిన అల్లుడు శ్రీను సినిమాలో కూడా సమంత తనకంటే చిన్న వయసు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జోడీ కట్టింది. వీరిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఆరేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి : హీరోయిన్ ముఖాన్ని బాడీపై టాటూ వేయించుకున్న ప్రియుడు.. వీడియో వైరల్

Next Story

Most Viewed