ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?

by Disha Web Desk 10 |
kajal agarwal
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్‌లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించింది. అలా తన కెరీర్‌లో హీరోయిన్‌గా మొత్తం 50 సినిమాలు పూర్తి చేసుకుంది. అయితే వివాహం తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ తిరిగి తన పని స్టార్ట్ చేసింది. రీసెంట్‌గా బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక దీంతోపాటు వరుస భారీ చిత్రాలు లైన్‌లో పెట్టింది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. అలాగే ‘సత్యభామ’, హిందీలో ‘ఉమా’ చిత్రాలు చేస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సరసన ఒక సినిమాలో నటిస్తోంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది.


Next Story