Actress Sneha జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీరు ఆగవు?

by Dishanational2 |
Actress Sneha జీవితంలో కష్టాలు తెలిస్తే కన్నీరు ఆగవు?
X

దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ నవ్వుతూ, తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి బాల్యంలోని కష్టాలు తెలిస్తే కన్నీరు ఆగదు.

ఏంటీ నటి స్నేహ జీవితంలో అంత విషాధం ఉందా అనుకుంటున్నారా.. అసలు విషయంలోకి వెళ్తే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ తన బాల్యంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు అని చెప్పగా కూతుర్లలో తాను చివరిదాన్ని అని.. తనకు బదులుగా కొడుకు పుట్టాలని తన బామ్మ నటి గా కోరుకుందని,అయితే తను పుట్టడంతో తన ముఖాన్ని కూడా ఆమె చూడడానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని స్నేహ తెలిపింది.

చిన్నతనంలోనే మంచినీళ్లు పక్కనే ఉన్నా సరే వాటిని సోదరులకు తామే అందించాల్సి వచ్చేదని.. అదేమని ప్రశ్నిస్తే మేము మగాళ్ళము.. మీరు ఆడవాళ్లు ఇంటి పనిలే చేయాలని కండిషన్లు పెట్టేవారు అంటూ ఆమె తెలిపింది.అంతే కాకుండా ప్రతీ పని చేయాలని ఆర్డర్లు పెట్టేవారని, మా గురించి అస్సలు ఆలోచించే వారు కాదంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

Also Read.

Amala Akkineni : అమలకు ఉన్న వ్యాధి ఆడాళ్లందరికీ ఉంటే బాగుండు.. నెటిజన్స్ కాంట్రవర్సీ కామెంట్స్


Next Story

Most Viewed