అమెరికాలో ట్రీట్‌మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా!

by Dishanational2 |
అమెరికాలో ట్రీట్‌మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా!
X

దిశ, సినిమా: గత ఏడాది అక్టోబర్ నెలలో సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. అయినప్పటికి సమంత తట్టుకోలేకపోయింది. నెలల తరబడి ఇంటికి పరిమితమైంది. ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చిన సమంత మీడియా సమావేశంలో ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది. ఇందులో భాగంగా రీసెంట్‌గా సమంత ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని న్యూస్ టాలీవుడ్‌లో మారుమోగిపోతుంది. ఇప్పటికే తన ‘ఖుషి’ మూవీ చిత్రీకరణ పూర్తి కాగా.. ‘సిటాడెల్’ షూటింగ్ సైతం చివరి దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళుతుందట. అక్కడ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోనున్నారట. కాగా ఈ ట్రీట్మెంట్ కోసం సమంత దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

Also Read: ‘బిగ్‌బాస్ 7’ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన Maadhavi Latha.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్..



Next Story