ప్రేమకథా చిత్రం బ్యూటీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసా?

by Dishanational2 |
ప్రేమకథా చిత్రం బ్యూటీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నీకు నాకు డాష్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముదుగుమ్మ నందితా రాజ్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సుధీర్ బాబుకు జోడిగా ప్రేమకథా చిత్రమ్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరస ఆఫర్లతో నందితా స్టార్ హీరోయిన్ స్టేజ్‌కు ఎదుగుతుంది అని అందరూ ఊహించారు. కానీ వారు అనుకున్నదానికి రివర్స్ జరిగింది. ప్రేమకథా చిత్రం తర్వాత వరస సినిమాలు చేసిన ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. తర్వాత ఆఫర్స్ రావడమే కష్టమైంది. ఇక చాలా రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ చిత్రపరిశ్రమలో ఎక్కడా కనిపించడం లేదు.

అయితే సినిమా ఆఫర్లు రాకపోవడంతో నందితా పరిస్థితి దారుణంగా మారిపోయిందంట. దీంతో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇంటికే పరిమితమైంది అంట. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుంది. ఎక్కడుంది. ఎవ్వరికీ తెలియదు.


Next Story