Niharika Konidela :మెగా డాటర్ నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

by Dishanational2 |
Niharika Konidela :మెగా డాటర్ నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా డాటర్ నిహారిక కొనిదల. ఈ అమ్మడు తన భర్తకు దూరంగా ఉంటొందని, విడాకులకు కూడా సిద్ధమయ్యారంటూ చాలా గాసిప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

అదిఏమిటంటే.. మెగా ఫ్యామిలీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారికే. ఈ అమ్మడు ఒక మనసు సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అయితే నిహారిక నిహారిక ఓ సూపర్ హిట్ మూవీని చేతులారా మిస్ చేసుకుందంట. ఇంతకీ నిహారిక మిస్ చేసుకున్న ఆ సినిమా మరేదో కాదు `నేను శైలజ`. ఇందులో ముందుగా నిహారికను హీరోయిన్‌గా అనుకున్నారంట. కానీ ఆమె ఇంట్లో వాళ్లతో మాట్లాడి చెబుతా అని దాదాపు నెల రోజుల టైం తీసుకుందంట. నెల గడిచిపోతున్నా..నిహారిక నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో,మూవీ టీం కీర్తీ సురేష్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారంట. ఒక వేళ ఆ సినిమాకు నిహారిక ఒకే చెప్పి ఉంటే ఇప్పటికి ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయేది అంటున్నారు తమ అభిమానులు.

Read more:

నిహారిక డ్రెస్సింగ్‌పై నెటీజన్స్ ట్రోలింగ్..

పుట్టినింట్లో లింగ వివక్ష.. కన్న తల్లే కారణమంటున్న సోనమ్

BRO సినిమా అప్‌డేట్: సాయితేజ్ ఫస్ట్ లుక్‌ విడుదల



Next Story

Most Viewed