ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నా్: నందిని రెడ్డి

by Disha Web Desk 23 |
ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నా్: నందిని రెడ్డి
X

దిశ, సినిమా : స్వప్న సినిమా నిర్మాణం, నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నందిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు పంచుకుంది. ‘విక్టోరియాపురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు, లవ్‌ స్టోరీకి సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కొత్త పాయింట్‌ అందులో నో డౌట్‌. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండటం.. వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్‌. కథకు కావాల్సిన అంశాలు ఉంటూ కథ జరిగే క్రమంలో అందరికీ ఎమోషన్‌ కనెక్ట్‌ అయ్యేలా వుంటాయి. ఇలాంటి సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. స్క్రీన్‌పై ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. మరో ఊహించని కథతో నా నెక్ట్స్‌ చిత్రం రాబోతుంది’ అని వివరించింది.

Also Read..

‘సింహాద్రి’ రీ రిలీజ్ క‌లెక్షన్స్‌.. వాళ్లకే ఇస్తామంటున్న మేకర్స్?

Next Story

Most Viewed