అమ్మ గురించి అలాంటి వార్తలు రాయొద్దు.. మీనా కూతురు వార్నింగ్! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-22 13:58:02  IST  )

స్టార్ హీరోయిన్ మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది.

అమ్మ గురించి అలాంటి వార్తలు రాయొద్దు.. మీనా కూతురు వార్నింగ్! (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేల్ల విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకుంది వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే ఇటీవల మీనా భర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మినా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల చెన్నైలో ప్రత్యేక సన్మాక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలు హాజరయ్యారు. ఇందులో మీనా కూతురు నైనిక ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘‘ అమ్మా నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఇక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. ఇటీవల న్యూస్ ఛానెల్స్ నీ గురించి షేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి అలాంటి వార్తలు రాయొద్దు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనా కూతురికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story