హీరోయిన్లు గ్లామర్ చూపించడానికే పనికొస్తారా.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-16 07:20:24  IST  )

బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte)అడపా దడపా సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

హీరోయిన్లు గ్లామర్ చూపించడానికే పనికొస్తారా..  రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte)అడపా దడపా సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక గత ఏడాది ‘సిస్టర్ మిడ్‌నైట్’(Sister Midnight) ఓటీటీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నట్లు టాక్. ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నిత్యం పలు వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, రాధిక ఆప్టే హీరోయిన్ల పరిస్థితిని వివరిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది. ‘‘సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల చాలా వివక్ష చూపిస్తారు. స్టోరీలో హీరోయిన్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు.

ఎప్పుడూ హీరోను హైలెట్ చేయడం కోసమే చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు చూస్తే మాత్రం కేవలం హీరోల కోసమే చేస్తున్నారేమో అనిపిస్తుంది. హీరోయిన్ అంటే గ్లామర్‌ చూపించడానికి తప్ప అంతకు మించి ఇంకేం ఇంపార్టెన్స్ మాకు ఉండదు. అందాన్ని చూపిస్తూ ఎక్స్పోజింగ్ చేయాలి. ఏ కొంచెం స్కోప్ ఉన్న పాత్ర కూడా హీరోయిన్లకు ఇవ్వరు. హీరోయిన్లు ఎప్పుడూ హీరో వెనకాల ఉండి కాపాడమని నిలబడాలి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.

Next Story