- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన పదేళ్లకు తల్లి కాబోతున్న నటి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బుల్లితెర మోస్ట్ పాపులర్ కపుల్ దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.

దిశ, సినిమా: బుల్లితెర మోస్ట్ పాపులర్ కపుల్ దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. వివాహమైన పదేళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘యే హై మొహబ్బతేన్’ ఫేమ్ దివ్యాంక ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇక దివ్యాంక, వివేక్ లవ్ స్టోరీ విషయానికొస్తే.. వీరిద్దరు తొలిసారి 'యే హై మొహబ్బతేన్' సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఇక అక్కడ మొదలైన వీరి పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారి, పెళ్లి పీటల వరకు దారితీసింది. జూలై 8, 2016న భోపాల్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
అప్పటి నుండి ఈ జంట తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఇక పదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానిస్తుండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. దివ్యాంక త్రిపాఠి కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా 'ఖత్రోన్ కే ఖిలాడీ 11' వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొని తన ధైర్యాన్ని నిరూపించుకున్నారు. చివరిగా 'అదృశ్యం' అనే వెబ్ సిరీస్‌లో ఇజాజ్ ఖాన్ సరసన నటించి మెప్పించారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్నందున ఆమె షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.






