టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ డైరెక్టర్ విడాకుల ఇష్యూ

by Disha Web |
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ డైరెక్టర్ విడాకుల ఇష్యూ
X

దిశ, వెబ్‌డెస్క్ : సినీ పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోంది. చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. ఇక తమకు ఎంతో ఇష్టమైన కపుల్స్ విడిపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలా మంది సినీ నటులు విడాకులు తీసుకున్నారు. సమంత నాగచైన్య విడాకులు తీసుకుని తమను ఎంతగానో అభిమానించే అభిమానులకు షాక్ ఇచ్చారు. కొన్ని రోజులు వీరి విడాకుల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక వీరి తర్వాత అమీర్ ఖాన్ - కిరణ్ రావు, ధనుష్ - ఐశ్వర్య ఇలా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. కాగా, మరోసారి సినీ పరిశ్రమ నుంచి ఓ స్టార్ డైరెక్టర్ విడాకుల విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ తమిళ దర్శకుడు బాలా తమ భార్య ముత్తుమలర్‌కు విడాకులు ఇచ్చాడు. చిన్న చిన్న ఇష్యూస్ వలన వారు మార్చ్ 5న విడాకులు తీసుకున్నారు. ఇప్పటికే నాలుగేళ్లుగా విడి విడిగానే ఉంటున్న వీరు పరస్పర అంగీకారంతో విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఏది ఏమైనా ఓ స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. డైరెక్టర్ బాలాకు టాలీవుడ్‌లో కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇక 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంటకు చిన్న పాప కూడా ఉంది. బాలా జంట విడాకులు తీసుకోని విడిపోవడంతో టాలీవుడ్ అభిమానుల్లో చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక హీరోల‌ను విల‌క్షణంగా చూపిస్తూ బాలా సినిమాలు చేస్తుంటారు. త‌మిళంలో ఈయ‌న డైరెక్ట్ చేసిన సేతుతో విక్రమ్ పెద్ద స్టార్‌గా ఎదిగారు. ఈయ‌న డైరెక్ట్ చేసిన ఆర్య, సినిమా నేనే దేవుణ్ణి, విశాల్‌, చిత్రాలు తెలుగులో మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

Next Story