- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. అసలు విషయాలు చెప్పిన అభిషేక్ బచ్చన్
ఐశ్వర్య సాధించే విజయాలు నాకు గర్వకారణమే తప్ప, అవి మా మధ్య ఎప్పుడూ ఈగో సమస్యలను తీసుకురావు

దిశ, సినిమా: బాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, త్వరలోనే విడిపోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అభిమానులు ఆందోళన చెందారు. ఈక్రమంలో.. తాజాగా ఈ రూమర్లకు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. తమ బంధం గురించి అభిషేక్ మాట్లాడుతూ.. "నా భార్య తన కెరీర్‌ను వదులుకుంటేనే నేను సురక్షితంగా ఉంటాను అని భావించే వ్యక్తిని కాను. అలాంటి అభద్రతాభావం మా మధ్య అస్సలు లేదు. మా నాన్న అమితాబ్ బచ్చన్ కంటే నా తల్లి జయా బచ్చన్ పెద్ద స్టార్‌గా ఉన్న సమయంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ఆ వారసత్వాన్ని, వారి మధ్య ఉన్న గౌరవాన్ని చూస్తూ పెరిగాను.
ఐశ్వర్య సాధించే విజయాలు నాకు గర్వకారణమే తప్ప, అవి మా మధ్య ఎప్పుడూ ఈగో సమస్యలను తీసుకురావు" అని స్పష్టం చేశారు. తన కూతురు ఆరాధ్య గురించి చెబుతూ.. "పిల్లలకు నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవడమే నిజమైన పెంపకం అని నేను నమ్ముతాను. తండ్రులు గొప్ప టీచర్స్ కాలేకపోవచ్చు కానీ, బిడ్డకు సరైన విలువలను అందించడంలో ఐశ్వర్య, నేను ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం" అని తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ జంటపై ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అభిషేక్ స్పందించడంతో ఈ విడాకుల పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది.






