- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hansika 'లవ్ షాదీ డ్రామా' ట్రైలర్!
సెలబ్రిటీల వివాహాలంటే జనాలకు ఓ పెద్ద వేడుకలాంటివే.

దిశ, సినిమా: సెలబ్రిటీల వివాహాలంటే జనాలకు ఓ పెద్ద వేడుకలాంటివే. మ్యారేజ్ విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి వారి మీదే ఉంటుంది. దుస్తుల డిజైన్, పెళ్లి సెట్టింగ్‌లు, సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు అంటూ.. దాని గురించి చర్చించుకుంటారు. ఇక గతేడాది డిసెంబర్ 4న హీరోయిన్ హన్సిక, సోహైల్ కథూరియా వివాహం చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ వివాహ వేడుకలు ఓటీటీల ద్వారా ప్రసారం చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పటికే నయనతార, విఘ్నేష్‌లు తమ వివాహ వేడుకను టెలికాస్ట్ చేయగా ఇప్పుడు అదె దారిలో హన్సిక కూడా చెరిపోయింది. జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుక స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకోగా ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.






