పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్న డిజాస్టర్ డైరెక్టర్.. ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Mehar Ramesh) ‘వీర కన్నడిగ’ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్న డిజాస్టర్ డైరెక్టర్.. ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Mehar Ramesh) ‘వీర కన్నడిగ’ సినిమాతో దర్శకుడి అవతారమెత్తాడు. ఇక తెలుగులో ఎన్టీఆర్‌తో కంత్రి, శక్తి, ప్రభాస్‌తో బిల్లా, వెంకటేష్‌(Venkatesh)తో షాడో, చిరంజీవితో భోళా శంకర్(Bhola Shankar) చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో బిల్లా తప్ప అన్ని సినిమాలు డిజాసర్లే. ‘బిల్లా’ సినిమాలో ప్రభాస్‌(Prabhas)ని చూపించిన విధానం, యాక్షన్ సీక్వెన్స్, టేకింగ్ చూసి మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతాడని అంతా ఊహించారు. కానీ ఆయన తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోవడంతో హీరోలంతా ఆయనతో వర్క్ చేసేందుకు వణికిపోతున్నారు.

ఈ క్రమంలో.. మెహర్ రమేష్ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా చేస్తానని అనడంతో అంతా వద్దు బాబోయ్ అని వేడుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెహర్ రమేష్ ‘‘నేను అన్నయ్య చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకున్నాను .. 'భోళా శంకర్' తో నా కల నెరవేరింది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా సినిమా చేయాలనేది నా కోరిక. కచ్చితంగా చేస్తాను అనే నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఆయనను తిడుతున్నారు. ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేస్తావ్ మా అన్నయ్యతో మాత్రం సినిమా చేయకు స్వామి నీకో దండం అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

Next Story